స్వీయ అన్వేషణ

Phaniharam Vallabhacharya Avatar

నన్ను నేను తిరిగి చూసుకుంటూ ఉంటే ఆది శంకరులు అన్న “మార్గావర్తిత పాదుక” అన్నట్టే ఉంది. అందమైన అనుభవాలు మాత్రమేనా? ఎన్ని విషాదాలు, ఎన్ని సంఘర్షణలు, ఎన్ని నిందలు, ఎన్ని అభినందనలు… “నీ ఒక్కడికేనా? ఇవన్నీ అందరికీ ఉండేవేగా?” అంటారా?

నిజమే! ఇవన్నీ అందరి జీవితాలలో ఉండేవే! అందరూ మనుష్యులే అయినా ఒకరి ముఖానికీ మరొకరి ముఖానికీీ తేడా లేదూ? ఇదీ అంతే!

బుద్ధి తెలిశాక అంతా “ఘాట్ రోడ్” లో ప్రయాణమే! నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకునే సరికి 28 ఏళ్లు వచ్చేశాయి. అయితే, దానికి పునాది అంతకుముందు ఏడేళ్ల క్రితమే పడింది. అంటే 21 ఏళ్లు నా జీవితం నా చేతుల్లో లేదు.

అది కూడా తెలిస్తే చాలామంది “అవునూ! నాకూ అలాగే జరిగింది కదా!” అనుకుంటారు.

రేపటి నుంచీ ప్రయాణం ప్రారంభం…


One response

  1. Dharma Deepthi

    ఇది ఒక జీవితం. నేర్చుకోవలసినవీ ఉంటాయి, నేర్చుకోకూడనివీ ఉంటాయి. ఎవరికి అవసరం ఉన్నవి వారు తీసుకోవచ్చు… లేదూ … ఈ సోది మనకెందుకులే … అని తల త్రిప్పుకొని వెళ్ళీ పోవచ్చు. చదివి నచ్చితే సబ్స్క్రయిబ్ చేసి, నాతో ప్రయాణం చేయవచ్చు. మీ ఆలోచనలు, అభిప్రాయాలూ కామెంట్స్ తో పంచుకోవచ్చు.

    Like

Leave a comment