అవును!
రాత్రి నిద్ర పోతూంది!
ఈ రాత్రి నిద్ర పోతూంది
చుక్కల దుప్పటి కప్పుకొని
జాతి గుండెల మీద వాలి.
చుక్కలన్ని కలలు!
ప్రతి చుక్కా ఒక గాయమే!
తడుముకుంటూనే ఉంది!
ప్రతి గాయమూ ఒక గేయమే!పాడుకుంటూనే ఉంది!
కలలు ఫలిస్తూనే ఉంటాయ్! గాయాలు మానిపోతూనే ఉంటాయ్! గేయాలు రాగిల్లుతూనే ఉంటాయ్!
వాటినలా వదిలేస్తే!
వదలరుగా!
పూత కూడా రానివ్వరు! కెలుకుతూనే ఉంటారు!
మాట మాటనూ విరిచేస్తూనే ఉంటారు!
వాళ్ళకి వేరే పని లేదు!
వేరే పని కూడా తెలియదు! అసత్యాన్ని సత్యంగా…
అధర్మాన్ని ధర్మంగా…
నీతిని అవినీతిగా…
అదే బతుకు వీళ్లకి!
నిద్ర వదలక పోతే…
కప్పుకున్న చుక్కల దుప్పటిలో శాశ్వతంగా కలసిపోవడమే!
Leave a comment