స్వీయ అన్వేషణ -154
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నే నమ్మితి
నీ చిత్తం బికను ||
మరువను ఆహారంబును
మరువను సంసార సుఖము
మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ ।।
మరచెద సుజ్ఞానంబును
మరచెద తత్వ రహస్యము
మరచెద గురువును దైవము
మాధవ నీ మాయ।।
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు
విష్ణుడ నీ మాయ।।
విడిచెద షట్కర్మంబులు
విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును
విష్ణుడ నీ మాయ।।
తగిలెద బహు లంపటముల
తగిలెద బహు బంధముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామియై
నగి నగి నను నీ వేలితి
నాకా యీ మాయ ||
ఇంతకన్నా ఏం అనగలను? ఆ మాయను ఛేదించే పరాత్పరుని పాదాలను ఎదుట నిలిపే శ్రీ గురుదేవులకు సర్వస్వ శరణాగతి చేయటం తప్ప?
Leave a comment